కర్నూలు జిల్లా, చాగలమర్రి మండలంలోని బ్రాహ్మణపల్లె గ్రామంలో రైతులు మొక్కజొన్న పంట సాగు చేశారు. గ్రామంలోని కౌలు రైతు వెంకటన్న, రవితేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రమణ, దామోదర్‌రెడ్డి, మరి కొందరు రైతులు 50 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారు. నెల దాటినా పంట ఏపుగా పెరగక పోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎకరాకు రూ.12వేలు పెట్టుబడి పెట్టి పంట సాగు చేశారు. పెట్టిన పెట్టుబడి వచ్చే ప రిస్థితి కూడా కనిపించడంలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతా వరణ ప్రభావం, వర్షాభావంతో పంట ఎదుగుదల లేకపోయిందని రైతులు విలపించారు. మొక్కజొన్న మొక్కలు పెరగక పోవడంతో రైతులు ప్రత్యా మ్నాయ పంట సాగు చేయడం కోసం ట్రాక్టర్లతో దున్నేశారు. మొక్కజొన్న పంట దెబ్బతిని నష్టపోయామని రైతులు వాపోయారు. ప్రభుత్వం నష్టపరి హారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరారు.