కర్నూలు జిల్లా, కొలిమిగుండ్ల మండలంలోని రామ్‌కో సిమెంటు పరిశ్రమ వద్ద అనుమానాస్పదస్థితిలో కర్ణాటక వాసి మృతి చెందిన విషాదకర సంఘటన సోమవా రం చోటు చేసుకుంది. సీఐ గోపినాథ్‌రెడ్డి తెలిపిన వివరాలమేరకు కర్ణాటక రాష్ట్రం, బాగేపల్లి నియోజకవర్గం జూల్పాల్య గ్రామానికి చెందిన యాతం విజ్కుమార్(27) సిమెంట్ లోడు కోసం లారీతో రామ్‌కో సిమెంటుకు ఆదివారం రాత్రి చేరుకున్నాడు. లారీ అక్కడే పెట్టుకొని లారీ క్యాబిన్లో పడుకొని నిద్రపోయాడని, సోమవారం చూడ గా మృతి చెంది పడివున్నట్లు పేర్కొన్నారు. మృతుడి తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.