నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు. నంద్యాల పార్లమెంట్ పరిధిలోని సమస్యల పరిస్కారంపై ఆమె చర్చించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఆమె భేటీ అయ్యారు. నంద్యాల పార్లమెంట్ పరిధిలోని సమస్యలను అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు. నంద్యాల పార్లమెంట్ సమగ్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. అలాగే కేంద్ర స్కిల్ డెవల్‌మెంట్‌శాఖ మంత్రి జయంత్ చౌదరి, సింగరేణి బొగ్గు గనుల శాఖమంత్రి కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రులతో బైరెడ్డి శబరి విడివిడిగా సమావేశమయ్యారు. ఏపీలోని సమస్యలను పరిష్కరించాలని రాయల సీమలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. నంద్యాల పార్లమెంట్ పరిధిలో బొగ్గు ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలని స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షనా కేంద్రాన్ని నంద్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పదించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి తె లిపారు.