ఢిల్లీ రాజేంద్రనగర్ లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్ సెల్లార్లోకి వరద పోటెత్తడంతో ముగ్గురు స్టూడెంట్లు చనిపోయారు. శనివారం సాయంత్రం ఓల్డ్ రాజేంద్రనగర్లో భారీ వర్షం కురిసింది. దీంతో వరద నీళ్లంతా సెల్లార్లోకి వెళ్లాయి. వరద ఉధృతికి లైబ్రరీ తలుపులు పగిలిపోయాయి. ఆ టైమ్లో సుమారు 18 మంది స్టూడెంట్లు లోపలే ఉన్నారు. ఈ ఘటనలో తానియా సోని (25), శ్రేయా యాదవ్ (25), నవీన్ డాల్విన్ (28) ప్రాణాలు కోల్పోయారు.