ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ కమిటీల ఎన్నికలకు విద్యాశాఖ బుధవారం షెడ్యూల్ ప్రకటించింది. పేరెంట్స్ కమిటీల పదవీకాలం పూర్తవడంతో ఎన్నికకు చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 1న ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసి ఓటర్ల జాబితా ప్రకటించాలని ఆదేశించారు. 8న కమిటీ సభ్యుల ఎన్నిక, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎంపిక చేపట్టాలని పేర్కొన్నారు.