నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను మరో దఫా తగ్గించాలని నిర్ణయించడమైనది. బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో రూ.160 నుంచి రూ.150కీ, బియ్యం రూ.48 నుంచి రూ.47కీ, స్టీమ్డ్ బియ్యం రూ.49 నుంచి రూ.48కీ తగ్గించడమైనది. తగ్గించిన ధరలతో రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి గురువారం నుంచి విక్రయిస్తారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్లకు ఆదేశించడమైనది. రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం- ఈ నెల రోజులలోపున బియ్యం, కంది పప్పు ధరలను రెండుసార్లు తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.