యలమంచిలి మండలంలో వరద ముంపు గ్రామం బాడవలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. గ్రామాన్ని వరద నీరు దిగ్బంధం చేయడంతో ట్రాక్టర్‌పై చేరుకుని నాలుగైదు అడుగుల నీటిలోనే తిరిగారు. అక్కడ వరద బాధితులను పరామర్శించి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ సాయంగా 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, కాయగూరలు అందజేశారు. ఇళ్లల్లోకి పూర్తిగా వరద నీరు చేరిన బాధిత కుటుంబాలకు మూడు వేలు నగదు పంపిణీ చేశారు.