రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ వరుసగా రెండవ రోజు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం అనంతపురం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజలు, నాయకుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఇందులో భాగంగా ప్రజల సమస్యలను మంత్రి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు మంత్రి భరోసా కల్పించారు.