కేరళలోని వయనాడ్ లో సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా సుమారు 160 మంది వరకు చనిపోగా..600 మంది కార్మికులు కనిపించకుండా పోయారు. అసలు ఈ స్థాయిలో ప్రకృతి ప్రకోపానికి కారణం ఏంటి? అంటే వాతావరణ మార్పులే అని నిపుణులు గట్టిగా చెబుతున్నారు. కేరళ వయనాడ్లో కొండచరియలు విరిగిపడటానికి అధిక మైనింగ్, ఆ ప్రాంతంలో అటవీ విస్తీర్ణం కోల్పోవడం, వాతావరణ మార్పుల ప్రభావం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.