రాజమహేంద్రవరంలో బ్లేడ్ ,గంజాయి బ్యాచ్ అనే పదాలు వినబడకుండా పోలీస్ ,ఇతర శాఖల సమన్వయంతో పూర్తిగా అరికడతామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 46వ డివిజన్లో మంగళవారం జరిగిన మీ భద్రత..మా బాధ్యతలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2019-24 మధ్య రాజమహేంద్రవరంలో బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు పెరిగిపోయాయని వాటిని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు కృషి చేస్తున్నామన్నా రు. మహిళలకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం చేర్యలు చేపడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, టీడీపీ నగర అధ్యక్షుడు రెడ్డి మణి, నాయకులు అగురు ధనరాజు, మొకమాటి సత్యనారాయణ, కొయ్యల రమణ, తురకల నిర్మల, మండల రవి, పిడిమి ప్రకాష్, కేబుల్ మురళీ పాల్గొన్నారు.