క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను అదిరోహించాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ రోడ్డులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం విద్యార్థులకు బుధవారం పుస్తకాలు పంపిణీచేసి మాట్లాడారు. ప్రభుత్వ కళాశాలల్లో చదువుకుని ఎందరో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. ఎక్కడ చదివామన్నది కాదు.. ఎలా చదువుతున్నాం.. ఎంత నేర్చుకున్నాం అన్నదే ముఖ్యమన్నారు. జూనియర్ కళాశాలలో మరో పది అదనపు తరగతులు నిర్మిస్తామని.. నాడునేడు పనులను వేగవంతం చేస్తామన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ న్ విద్యార్థి మిత్ర పఽథకంద్వారా ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సహాలను ఉప యోగించుకుని మంచి ఫలితాలు పొందాలన్నారు.తొలుత కళాశాల ప్రాం గణంలో మొక్కలు నాటారు. డీఐవో ఎన్‌వీఎస్‌ఎల్ నరసింహం, డీవైఈ వో జేవీఎస్‌ఎస్ సుబ్రహ్మణ్యం, డీఈవో కే.విశ్వనాఽథం, పీవో సర్వశిక్ష అభియాన్ ఎస్.సుభాషిణీ, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ దిలీప్ కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు పాల్గొన్నారు.