విద్యావ్యవస్థకు పెను విఘాతంగా మారుతున్న జీవో 117ను రద్దుచేయాలని యుటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.విజయగౌరి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారంరామభద్రపురం ఎంఈవో ఆమిటి తిరుమలప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ 3, 4, 5 తరగతుల తరలింపును రద్దు చేయాలని, 1 నుంచి 5 తరగతులను ఒకే పాఠశాల లో నడపాల ని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షులు వి.ప్రసన్న కుమార్, జిల్లా కార్యదర్శి ఎం.కేశవరావు, మండల అధ్యక్షులు సుధాకరరావు పాల్గొన్నారు.