అనపర్తి మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యు డు నల్లమిల్లి మూలారెడ్డి ద్వితీయ వర్థంతి సందర్భంగా బిక్కవోలు మండలం బల భద్ర పురం గ్రామంలోని ఎంఎస్‌ఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటుచేసిన మెగా వైద్య శిబిరం విజయవంతం కావడానికి వైద్యులు, వైద్యాధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు. మంగళవారం అనపర్తిలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఆ యన నియోజకవర్గంలోని ప్రభుత్వ వైద్యులు, వైద్యాధికారులతో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా వైద్య శిబిరంలో 14రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని అదేవిధంగా కేన్సర్ రోగులకు స్ర్కీనింగ్ టెస్టులు నిర్వహిస్తామని తెలిపారు. మెగా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నా మన్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి వచ్చే రోగులకు బస్సు సౌకర్యాలతోపాటు భోజన సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. వివిధ రకాల రోగాలతో బాధపడుతున్న వారి వివరాలు ఇప్పటికే ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్ల వద్ద ఉంటాయని వీరంతా రోగులను వైద్య శిబిరానికి వచ్చే విధంగా ప్రోత్సహించాలని కోరారు. ఈ శిబిరంలో దంత వైద్యశిబిరం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని మూడురోజుల పాటు శిబిరం నిర్వహించి నెలరోజులపాటు వివిధ చికిత్సలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జీఎస్‌ఎల్ ఆసుపత్రి అనపర్తి ఐఎమ్‌ఏ సహాయంతో ఈ శిబిరాలు నిర్వహి స్తున్నామని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆసుపత్రిలో వివిధ కారణాలతో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వైద్య సేవలు అందుతున్న విదానాన్ని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తాడి రామగుర్రెడ్డి, ఆసుపత్రి వైద్యులు, పలు పీహెచ్‌సీల వైద్యాధికారులు, ఎన్డీయే నాయకులు సిరసపల్లి నాగేశ్వరరావు, తమలంపూడి సుధాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.