శ్రీకాకుళం రెండోపట్టణ పోలీసుస్టేషన్లో సి నెంబర్‌పై విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎన్.మాధవరావు అనారోగ్యంతో బాధపడుతూ విజయవాడలోని చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఆమదాలవలసలో విధులు నిర్వహిస్తున్న మాధవరావు ఈఏడాది మార్చిలో అనారోగ్యం వల్ల టూటౌన్‌కు సి నెంబర్‌పై వచ్చాడు. జలుమూరు మండలం కొత్తకోటకు చెందిన మాధవరావు దమ్మల వీధిలో నివాసముంటున్నాడు. కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతు న్నాడు. ఈ నేపథ్యంలో విజయవాడ చికిత్స పొందుతున్నాడు. మాధవరావుకి భార్య పిల్లలు ఉన్నారు. మాధవరావు మృతి పట్ల వారి కుటుంబానికి ఎస్పీ కేవీ మహే శ్వరరెడ్డి, టూటౌన్ సీఐ జి.ఉమామహేశ్వరరావులు సంతాపం తెలిపారు.