వేప గింజల కషాయంతో గుడ్డు దశలోనే పురుగుల నివారణ చేయవచ్చునని విజయనగరం జిల్లా వ్యవసాయాధికారి కె.రాబర్ట్‌పాల్ తెలిపారు. వేప గింజల కషాయం తయారీ విధానం, వినియోగంపై మంగళవారం పాచిపెంట మండలంలోగల అమ్మ వలసలో రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. వేప గింజల కషాయం వల్ల గులాబి రంగు కాయితలు పెరుగు నివారణ, రసం పీల్చు పురుగుల నివార ణకు అవకాశం ఉందన్నారు. రసాయనాలతో అవసరం ఉండదని తెలిపారు. 5 శాతం వేప గింజల కషాయం తయారీ విధానంపై వివరించారు. ముందుగా వేప పండ్లు సేకరించి వాటిని బాగా పిసికి గింజలను వేరు చేసి ఆరబెట్టాలన్నారు. ఆరిన గింజలను పై తొక్క తీసి వాటిని నుంచి వచ్చే వేప పప్పును సేకరించాలని చెప్పా రు. ఒక కిలో వేప పప్పును బాగా రుబ్బి ఒక గుడ్డ సంచిలో మూటగట్టి ఒక కర్ర సహాయంతో 10 లీటర్ల నీటిలో 12 గంటల పాటు మునిగి ఉండేటట్టు నానబెట్టి కషాయాన్ని బాగా నీటిలోకి దిగేటట్టు వడగట్టిన అనంతరం ఒక లీటరు నీటికి ఐదు మిల్లీ లీటర్ల కషాయాన్ని కలిపి పిచికారీ చేయాలన్నారు. ఈ కార్యక్ర మంలో సాలూరు వ్యవసాయ సహాయ సంచాలకుడు మధుసూదనరావు, సాలూరు ఏవో అనురాధ, మండల వ్యవసాయాధికారి పి.తిరుపతిరావు, రైతులు పాల్గొన్నారు.