పిఠాపురం పట్టణానికి చెందిన వృద్ధురాలు శ్రీమతి విన్నపాల చంద్రలేఖ గారు తన ఇంటిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారు అని ఆవేదన చెందుతూ, తమను కాపాడాలని ప్రసార మాధ్యమాలు ద్వారా చేసిన విజ్ఞప్తి - రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీపవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్లింది. తక్షణమే స్పందించి వృద్ధురాలి ప్రస్తావించిన సమస్యపై తగిన విచారణ చేయాలని జిల్లా యంత్రాంగానికి స్పష్టం చేశారు. కాకినాడ ఆర్డీవో పిఠాపురంలోని శ్రీమతి చంద్రలేఖ గారు ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. ఇంటికి సంబంధించిన వివాదం పిఠాపురం జూనియర్ సివిల్ కోర్టులో ఉన్నందున శ్రీమతి చంద్ర లేఖ గారి కుటుంబాన్ని ఇబ్బందిపెట్టరాదని అవతలి పక్షానికి అధికారులు స్పష్టం చేశారు.