యూపీ రాజధాని లక్నోలో వరద నీటిలో బైక్‌పై వెళుతున్న మహిళను పోకిరీలు వేధించిన ఘటనపై ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్ స్పందించారు. యూపీలో మహిళలపై పెచ్చుమీరిన ఆగడాలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన డింపుల్ యాదవ్ నిందితులపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మహిళను వేధిస్తున్న వీడియోలు, రికార్డింగ్‌లు వెలుగుచూశాయని, ఈ పని ఎవరు చేశారనేది ప్రభుత్వం సులభంగా గుర్తించవచ్చని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa