రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. గురువారం నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అందజేస్తున్న పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో ఎక్కువగా పేదరికానికి చెందిన విద్యార్థులే చేరుతూ ఉంటారని వారిని ఆదుకుంటామని అన్నారు.