ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల వర్గీకరణ పై 30 సం, పాటు సుదీర్ఘ పోరాట ఫలితంగా గురువారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు డి మరియన్న మాదిగ అన్నారు. ఈ సందర్భంగా గురువారం కాజీపేట పట్టణంలో ఆయన మాట్లాడుతూ. వర్గీకరణ పోరాటంలో కృషిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, అసువులు బాసిన అమరులకు జోహార్లు తెలిపారు.