వెంకన్న చెరువు దిగువ భాగంలో నిర్మించిన చెక్‌డ్యామ్ ఎత్తును తగ్గించి ముంపునకు గురవుతున్న పంటలను కాపాడాలని ముంపు బాధిత రైతులు బుధవారం చనిపోయిన మొలకలు చూపిస్తూ పంటచేలలోకి దిగి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంకన్న చెరువు ఆయకట్టు ఎగువ భాగంలో ఉన్న ముంపు బాధిత రైతులు విలేఖర్లతో మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా గోపాలపురం, కొవ్వూరుపాడు రెవెన్యూ పరిధిలో ఉన్న వెంకన్నచెరువు దిగువ భాగంలో నిర్మించిన చెక్‌డ్యాం ఎత్తు పెంచి నిర్మించటంతో ప్రతీఏటా సుమారు 20మంది రైతులకు చెందిన 30 ఎకరాల పంట నీటమునుగుతు ందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు అధికారులకు తెలియజేసినప్పటికీ ఫలితం దక్కలేదన్నారు. దీంతో వెంకన్నచెరువు ఎగువ భాగంలో ఆరు ఎకరాల చెరుకు, 24 ఎకరాల వరి, నీటమునిగిపోయి చనిపోతుంద న్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వెంకన్న చెరువు నిండిపోయి దిగువభాగంలో ఉన్న పంట నీటమునిగింద న్నారు. అధికారులు స్పందించి చెక్‌డ్యాం ఎత్తు తగ్గించి నీటమునిగిన పంటను కాపాడాలని బాధిత రైతాంగం పాలకులను కోరారు. కార్యక్రమంలో భాధిత రైతులు నరసింహమూర్తి, శ్రీరామమూర్తి, జక్కు శ్రీను, జక్కు సుబ్బాయమ్మ, బుర్రి సుబ్బలక్ష్మి, కొండా గవరమ్మ, జక్కు వెంకటస్వామి, జక్కు సుబ్బారావు, తదితర రైతులు నిరసన చేపట్టిన వారిలో ఉన్నారు.