ఆ బాలికకు 12 సంవత్సరాలు. ఆమె చక్కెర వ్యాధి (షుగర్) బారిన పడ్డారు. తల్లిదండ్రులు సకాలంలో గుర్తించకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా, కొండపి మండలంలోని తాటాకులపా లెంలో చోటుచేసుకుంది. బాలిక తల్లిదండ్రులు, బంధువులు సమాచారం మేరకు.. తాటాకులపాలెం గ్రామానికి చెందిన కదిరి శ్రీనివాసరెడ్డి, జ్యోతి దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌లో బే ల్దారి పనులు చేసుకుంటూ అక్కడే ఉండి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆయన పెద్ద కుమార్తె కదిరి మోక్ష (12) హైదరాబాద్‌లోనే 8వ తరగతి చదువుతోంది. పదేపదే నీరసం అని మోక్ష అంటుండటంతో ఇటీవ ల హైదరాబాద్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు షుగర్ ఉన్నట్లు గుర్తించలేకపోయారు. నీరసం తగ్గడానికి మాత్రమే మం దులిచ్చి పంపారు. అయినప్పటికీ ఆ బాలిక ఆరోగ్యం కుదుటపడకపోడంతో తల్లిదండ్రులు మోక్షను తీసుకుని గత ఆదివారం స్వగ్రామానికి వచ్చారు. సో మవారం మోక్ష మరింత నీరసించడం తో కొండపిలోని ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. ఆమె పరిస్థితిని గుర్తించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఒం గోలు తీసుకెళ్లాలని సూచించారు. దీం తో 108లో మోక్షను ఒంగోలులోని జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ ప రీక్షలు చేయగా ఆ చిన్నారికి షుగర్ 700 పాయింట్లు ఉన్నట్లు తేలింది. వెంటనే తల్లితండ్రులు మోక్షను నగరంలోని ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. మంగళవారం సాయంత్రం షుగర్ అధికమై బ్రెయిన్‌డెడ్ కావడంతో చిన్నారి మోక్ష మరణించింది. దీంతో తల్లితండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.