అర్హులందరికీ పెన్షన్లు ఇస్తున్నామని పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. గురువారం పెదకూరపాడు మండలంలోని హుస్సేనగరం గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వారు హాజరయ్యారు. ఇచ్చిన హామీని నెరవేర్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి మాత్రమే చెందుతుందన్నారు. కుటుంబానికి పెద్దన్న పాత్రను చంద్రబాబు నాయుడు పోషిస్తున్నారన్నారు.