ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా తప్పించుకోవడంతో పాటు రాష్ట్ర అప్పుపై చేసిన దు్రష్ఫచారం బండారం బట్టబయలవుతుందనే భయంతోనే 2024–25 సంవత్సరం పూర్తి బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశ పెట్టలేదని ఆ ర్థి క శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ చేసి నాటకాలాడుతోందని మండిపడ్డారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి అంటే 2019 మే 30 నాటికి ఖజానాలో రూ.వంద కోట్లే మిగిలాయంటూ ‘ఈనాడు’ ప్రచురించిన కథనాన్ని గుర్తు చేస్తూ.. ప్రజలకు ఇచి్చన హామీలను అమలు చేయాలన్న చిత్తశుద్ధితో 2019–20కి సంబంధించి రూ.2,27,975 కోట్లతో పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టామని చెప్పారు. కొత్త సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడానికి రెండ్రోజుల ముందు అంటే జూన్ 10న కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా అదనపు నిధులు రూ.5,655.72 కోట్లు రాష్ట్రానికి విడుదల చేసిందని.. జూలై 23న ప్రవేశపెట్టిన బడ్జెట్లో పన్నుల్లో వాటా, గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి వచ్చే నిధుల లెక్కను తేల్చి చెబుతూ కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఎత్తిచూపారు. కోవిడ్ వంటి ప్రత్యేక పరిస్థితులు లేకున్నా, నిధుల విషయంలో అస్పష్టత లేకపోయినప్పటికీ పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీ మొదటి సమావేశాలు జూన్ 21.. రెండో సమావేశాలు జూలై 22–27 వరకు నిర్వహించారని, ఆ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టకుండా.. ఆర్డినెన్స్ ఎందుకు జారీ చేయాల్సి వచి్చందో చెప్పాలని నిలదీశారు.