రాజాం పట్టణంలో 20వ వార్డ్ లో ఎన్డిఏ కూటమి నాయకులు గురువారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటగిరి నారాయణరావు మాట్లాడుతూ పేదలందరికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు జొన్నాడ రంజిత్ కుమార్ , టీడీపీ నాయకులు తోలేటి బుజ్జి, సవలపురపు శ్యామ్ మజ్జి షణ్ముఖ, యమ్మల బాలరాజు, చిరంజీవి పాల్గొన్నారు.