ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. పంపిణీ దాదాపు పూర్తి కావొచ్చింది. పింఛన్ల పంపిణీ విజయవంతంగా సాగడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన ప్రారంభమయ్యాక పెంచిన సామాజిక పింఛన్లను రెండో నెలలోనూ విజయవంతంగా లబ్ధిదారులకు ఇంటి దగ్గరే పంపిణీ చేశామని అన్నారు. 64 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు రూ.2737.4 కోట్ల మొత్తాన్ని ఇవాళ (గురువారం) ఉదయం నుంచి ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందించారని చెప్పారు.