విశాఖపట్నం, భీమిలిలో భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తించిన ఎర్రమట్టి దిబ్బలను ఇష్టానుసారం తవ్వేస్తున్నారు. ఎర్రమట్టి దిబ్బలను తవ్వేసి వందల ఎకరాలను చదును చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మొదలైన పనులు ఇప్పటికీ నిరాటంకంగా సాగడం గమనార్హం. గత ఏడాది వీఎంఆర్‌డీఏ అధికారులు ఎర్రమట్టి దిబ్బల సమీపంలో లే అవుట్లకు అనుమతి ఇచ్చినప్పుడు కూడా ఇలాగే తవ్వేశారు. అప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చి పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నారని, వైసీపీ నేతలు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారింది. అయినా, ఇప్పటికీ తవ్వకాలను కొనసాగిస్తుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే ఎర్రమట్టి దిబ్బల అక్రమణలు చేశారని ఫిర్యాదులు వస్తుండటంతో మైనింగ్ శాఖ చర్యలకు ఉపక్రమించింది.