ఒక్కరోజులో 97 శాతం పింఛన్ల పంపిణీ సంతృప్తిని ఇచ్చిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. 1వ తేదీనే ఇంటి వద్ద రూ. 2737 కోట్లతో 64 లక్షల మందికి పెంచిన పింఛన్ల పంపిణీ ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 97.54 శాతం పింఛన్లు అందించామన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్దిదారుల ఆర్థిక భద్రత మా బాధ్యత అని చంద్రబాబు పేర్కొన్నారు. పెరిగిన పింఛను ఆ పేదల జీవితాలకు భరోసా కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు అందరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు.