జీవన్ దాన్ పై అవగాహన కార్యక్రమంలోపాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే బోండా ఉమ పాల్గొన్నారు. ఇదే వేదిక పై అవయవదానానికి అంగీకరిస్తూ మంత్రి సత్యకుమార్ సంతకం చేశారు. అవయవదానం చేసిన వారి కుటుంబ సభ్యులను సత్యకుమార్, బోండా ఉమ సత్కరించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ.. అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరగాలన్నారు. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నా... ప్రజల్లో మార్పు రాలేదన్నారు. మన రాష్ట్రం లో 260 మంది అవయవ దానంకోసం ముందుకు వచ్చారన్నారు. తెలంగాణలో ఎనిమిది వందల మంది ముందుకు వచ్చారన్నారు. 90 వేల మంది అవయవ దానం కోసం ఎదురు చూస్తున్నారన్నారు.