రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని మదనప ల్లె ఎమ్మెల్యే షాజహానబాషా అన్నారు. గురువారం చెంబకూరు, కాప్ప ల్లె, పెద్దకుర్పల్లె, రామసముద్రం పంచాయతీలలో జరుగుతున్న పింఛ న పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు పింఛన పంపిణీ చేశారు. అనంతరం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మం డల ప్రభుత్వ అధికారులతో రివ్యూలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పేదలకు ఇళ్లు, కొత్తరేషన కార్డులు, పింఛన్లు, నిరుద్యోగులకు భృతి తదితర సంక్షేమ పథకాలు అమలు జరుగనున్నాయని ఇందుకు సంబంధించి అర్హత ఉన్న లబ్ధిదారులను గుర్తించి ఫైళ్లను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్థానిక జూనియర్ కళాశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు, బుక్స్ పంపిణీ చేశారు. ఈసందర్భంగా కళాశాలలో తరగతి గ దులు, ప్రహరీ గోడ నిర్మించాలని ప్రిన్సిపాల్ ఎమ్మెల్యేను కోరగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు విజయ్కుమార్గౌడు, మదనపల్లె టౌన బ్యాంక్ మాజీ అధ్యక్షుడు విద్యాసాగర్, టీడీపీ సీనియర్ నాయకుడు రాటకొండ మధుబాబు, కొండూరు నారాయణరెడ్డి, ప్రశాంత, శ్రీకాంత, కృష్ణంరాజు, చిన్నూస్వామి, స్థానికం రాజేష్, మాజీ జడ్పీటీసీ శివశంకర్, బోయ రమణప్ప, శివారెడ్డి, పెద్దిరెడ్డి, రెడ్డిశేఖర్, వేణుగోపాల్, కృష్ణప్ప, శ్రీనివాసులు, చంద్రప్ప అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.