నష్ట పరిహారం కోసం నెల రోజులుగా బొప్పాయి రైతు లు చేస్తున్న ఆందోళన ఒక కొలిక్కి రావడం లేదు. దీంతో నర్సరీ యజ మానుల చేతిలో మోసపోయిన బొప్పాయి రైతులు గురువారం పెద్ద సం ఖ్యలో స్థానిక పోలీసు స్టేషను చేరుకుని ఆందోళన చేపట్టారు. నర్సరీ యజమానుల నుంచి నష్ట పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కలికిరి పోలీసు ఇనస్పెక్టరు ఆర్. మోహనను రైతులు ఆశ్ర యించారు. మదనపల్లె, కలికిరిలోని బొప్పాయి నర్సరీల నుంచి తెచ్చిన మొక్కలు సత్ఫలితాలివ్వకుండా ఈ ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయారు. నాసిరకం నకలీ మొక్కలను అంటగట్టి నర్సరీ యజమానులు మోసం చేశారని రైతులు ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నా ఫలితం దక్కక పోవడంతో గురువారం రైతులు మూకుమ్మడిగా పోలీసు స్టేషనుకు వచ్చి యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మదన పల్లెకు చెందిన శేఖర్ రెడ్డి, కలికిరికి చెందిన యల్లా రెడ్డి నర్సరీల నుంచి ఈ ఏడాది రైతులు కొనుగోలు చేసిన నకిలీ బొప్పాయి మొక్కల కారణం గా పంట దిగుబడిలేక నష్టాల పాలయ్యామని పోలీసుల ముందు వాపో యారు. ఎకరాకు రూ.2 లక్షల వరకూ పెట్టుబడులు పెట్టినా పాతిక శాతం కూడా ఫలితం దక్కలేదని ఈ కారణంగా స్థానిక నర్సరీ యజ మాని యల్లారెడ్డి నుంచి నష్ట పరిహారం ఇప్పించాలని, లేదా చట్టప రంగా చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. ఎకరాకు రూ.20 వేలు చెల్లించేందుకు నర్సరీ యజమాని అంగీకరించినట్లు రైతులు తెలిపారు. అయితే రూ.40 వేలు ఇచ్చినా జరిగిన నష్టం భర్తీ కాదని రైతులు స్పష్టం చేశారు. రైతుల డిమాండు మేరకు కలికిరి నర్సరీ యజమానిని పోలీ సులు స్టేషనకు రప్పించి రైతులతో చర్చించుకోవలని లేదంటే చట్టప రంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారని చెపుతున్నారు. మదన పల్లె నర్సరీ యజమాని శేఖర్ రెడ్డిని కూడా హాజరు పర్చాలని రైతులు పోలీసులను కోరారు. శుక్రవారం చర్చలు కొలిక్కి రానట్లయితే నర్సరీ యజమానులను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్దమవుతున్నట్లు కూడా చెపుతున్నారు. బొప్పాయి రైతులు సుధాకర్ రెడ్డి, రాఘవేంద్ర, వేణుగోపాల్, వెంకట్రమణా రెడ్డి, మదనమో హన రెడ్డి, శేఖర్ తదితరుల నేతృత్వంలో నర్సరీ యజమానులతో చర్చలు జరుపుతున్నారు.