ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల సొమ్మును పెంచడమే కాకుండా ప్రతి నెలా 1వ తేదీనే ఇళ్ల వద్దకు చేరుస్తున్నారని ఎమ్మెల్యే నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి తెలిపారు. పీలేరు పట్టణంలోని లక్ష్మీపురం, మోడల్ కాలనీల్లో లబ్దిదారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రనతో కలిసి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడుతూ గత ప్రభు త్వానికి కేవలం రూ.వేయి పెంచడానికి ఐదేళ్లు పట్టిందని, రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా పేద ప్రజల జీవితాలకు భరోసా కల్పించాలన్న లక్ష్యంతో చంద్రబాబు పింఛన్ల మొత్తాన్ని భారీగా పెంచారని తెలిపారు.