ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిం ఛన్లు పెంచడంతో అవ్వాతాతలు, దివ్యాంగుల కళ్ళలో ఆనందం కన్పిస్తోందని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయచం ద్రారెడ్డి పేర్కొన్నారు. ములకలచెరువు మండలంలోని మద్దినాయనిపల్లెలో గురువారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ద్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లను పెంచి నేరుగా లబ్ధిదా రుల ఇళ్లకు వెళ్ళి అందిస్తున్నారన్నారు. అవ్వాతాతలకు, వితంతువుల కు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేలు అందజేస్తున్నా మన్నారు. మండలంలో గురువారం 97.27 శాతం ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేసినట్లు ఎంపీడీవో పోలప్ప తెలిపారు. తొలి రోజు రికార్డు స్థాయిలో పింఛన్లను పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. మండలంలో మొత్తం 6729కి గానూ 6545 మందికి పింఛన్లు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో పోలప్ప, ఆర్‌ఐ వీరాంజనేయు లు, నియోజకవర్గ ప్రచార సమన్వయకర్త సీడు మల్లికా ర్జుననాయు డు, టీడీపీ నేత మంత్రి గిరిధర్‌రెడ్డి, నాయకులు మస్తానరెడ్డి, కేశవ రెడ్డి, రమణారెడ్డి, సురేష్, బాలకృష్ణ పాల్గొన్నారు.