సంక్షేమం, అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమ ని రాజంపేట పార్లమెంటరీ బీసీ సెల్ అధ్యక్షుడు సురేంద్రయాదవ్ పేర్కొన్నారు. గురువారం కురబలకోట మండలంలో ప్రభుత్వం ఎనటీఆర్ భరోసా పింఛన్లను మండలంలోని ప్రతి గ్రామంలో అధికారులు, టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా పింఛనలను ఇవ్వడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు అర్హులందరికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీ వో హరినారాయణ, అయూబ్బాషా, తదితరులు పాల్గొన్నారు.