అమృత తుల్యమైన తల్లిపాల విశిష్టతను వివరిస్తూ ఏటా ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నామని అమలాపురం పరిధి కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. నవజాత శిశువులకు తల్లిపాలే శ్రేష్టమన్నారు. తల్లీబిడ్డల శ్రేయస్సుకు తల్లిపాల వినియోగం ఎంత అవసరమో వివరించారు. పుట్టిన బిడ్డకు మొదటి గంటలోనే తల్లిపాలు పట్టించాలన్నారు. మొదటి ఆరు నెలలు తల్లిపాలు శ్రేష్టమన్నారు. డబ్బాపాలు వద్దు తల్లిపాలు ముద్దు అనే నినాదంతో ముందుకు సాగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం.దుర్గారావుదొర, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.