ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను రూ.4 వేలకు ఒకటో తారీఖునే ఇంటివద్దకే వెళ్లి అందజేస్తున్నారని మదనపల్లె ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నారు. గురువారం ఉదయం నుంచే రెవెన్యూ, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే షాజహానబాషా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి క్రమం తప్పకుండా ఇంటి వద్దకే పెన్షన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ఎన్డీఏ కూట మి నారాచంద్రబాబు నాయుడు సారథ్యంలో పెన్షన్లు పంపిణీ చేసిన ఘనత దక్కిందన్నారు. ఇందులో తట్టివారిపల్లె గ్రామం, బాలాజీ కాల నీ, ముజీబ్ కాలనీ, రామారావుకాలనీ, కృష్ణానగర్, ఎస్బీఐ కాలనీ, బర్మా వీధి, బసినికొండ ప్రాంతాల్లో వృద్థులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, వికలాంగులకు రూ.15 వేలు అందజేశారు. కార్యక్రమంలో డీపీవో ధనలక్ష్మీ, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, టీడీపీ నాయకులు నాదేళ్ల విద్యాసాగర్, షంషీర్, జేసీబీ వేణు, నవీన, మధు సూదనరెడ్డి, రెడ్డిబూ, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.