మాడుగుల మండలంలో చింతలూరు గ్రామానికి చెందిన 70 కుటుంబాలు బీజేపీలో చేరారు. గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు స్వామి హరీష్ సంతోష్ ఆధ్వర్యంలో వారంతా శనివారం బిజెపిలో చేరడంతో జిల్లా బిజెపి అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, పార్టీలోకి ఆహ్వానించి కండువాలు వేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో బిజెపి విశాఖ జిల్లా ఇన్చార్జి పుట్ట గంగయ్య, మండల సంతోషి సుబ్బలక్ష్మి, రాజు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.