వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం వైఖరిపై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు నిప్పులు చెరిగారు.అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అనే సామెతలా కేంద్ర తీరు ఉందని మండిపడ్డారు ఏపీ ఎంపీల మద్దతుతో మూడోసారి గద్దెనెక్కిన మోదీ.. ఆంధ్రుల తలమానికమైన విశాఖ ఉక్కుపై డబుల్ గేమ్ ఆడుతున్నారని షర్మిల విమర్శించారు.విశాఖ స్టీల్‌కు ఒక్క రూపాయి సహాయం చేయకుండా వెంటిలేటర్ మీదకు నెట్టారని అన్నారు. నిధులు ఇవ్వకుండా సైలెంట్‌గా విశాఖ ఉక్కును నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.ఉక్కును కట్టబెట్టే ముహూర్తం కూడా ఫిక్స్ చేశారని పేర్కొన్నారు. ఏపీ బీజేపీ నేతలను, కూటమిలో భాగస్వామ్యమైన టీడీపీ, జనసేన పార్టీలను హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేకుంటే.. ప్లాంట్ బలోపేతంపై మీకు చిత్తశుద్ధి ఉంటే.. తక్షణం ఆర్థిక సాయం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.ఆరు వేల కోట్ల అప్పుల్లో ఉన్నామని, ఉక్కు తయారీకి ముడిపదార్థాలు నిండుకున్నాయని, కొనేందుకు చిల్లగవ్వ కూడా లేదని, ఈ నెల జీతాలు కూడా ఇవ్వడం కష్టమేనని యాజమాన్యం చేతులెత్తేస్తుంటే.. మోదీకి కనీసం చీమైనా కుట్టినట్లు లేదని షర్మిల మండిపడ్డారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్లాంట్‌కు పునర్వైభవం తీసుకురావాలని డిమాండ్ చేశారు.