పాలనలో తనదైన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అధికారంలోకి వచ్చిరావడంతోనే అభివృద్ధిపై ఫుల్ ఫోకస్ పెట్టారు.ఏపీలో ఆగిపోయిన మెట్రో ప్రాజెక్టును మళ్లీ వెలుగులోకి తెచ్చారు. అంతేకాదు మెట్రో కార్పొరేషన్ ఎండీగా అప్పటి రామకృష్ణారెడ్డినే మళ్లీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ క్రమంలోనే అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ఎండీగా రామకృష్ణారెడ్డిని నియమించింది. అయితే రామకృష్ణారెడ్డి నేతృత్వంలోనే 2014లో విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైలుకు డీపీఆర్ సిద్ధం చేశారు. విశాఖలో మూడు లైన్లు 34.38 కిలోమీటర్లు, విజయవాడలో 2 లైన్లు 26 కిలోమీటర్ల మేర ప్రాజెక్టును నిర్మించాలని సంకల్పించారు. ఎంత వ్యయం అవుతుందో అంచనాతో కూడిన డీపీఆర్‌ను కేంద్రానికి పంపారు.ఇక మొన్నటి ఎన్నికల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆగిపోయిన మెట్రో ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే గతంలో ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన రామకృష్ణారెడ్డినే… ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీగా మళ్లీ నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.