ఎక్సైజ్‌లో పలు అంశాలపై ప్రభుత్వం ఆ శాఖ అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసింది. మద్యంలో ఎంఎన్సీ కంపెనీలు, పాపులర్ బ్రాండ్లను తిరిగి రాష్ర్టానికి తీసుకొచ్చే అంశంపై అదనపు కమిషనర్ ఎం.దేవకుమార్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించారు. మద్యం ఉత్పత్తిలో నాణ్యత కోసం సమగ్ర నాణ్యతా విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు జాయింట్ కమిషనర్ వి.అనసూయాదేవి నేతృత్వంలో కమిటీని వేశారు. కల్తీ మద్యం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ప్రారంభించడంపై డిప్యూటీ కమిషనర్లు పి.శ్రీదేవి, కె.శ్రీనివాసులు నేతృత్వంలో మరో ఒక కమిటీని నియమించారు.