మెంటాడ మండలంలోని ఆండ్ర జలాశయం నుంచి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శనివారం నీటిని విడుదల చేయనున్నారు. మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు ఖరీఫ్ పనులు ప్రారంభమయ్యాయి. మెంటాడ, బొండపల్లి, గజపతినగరం మండలాలకు చెందిన సుమారు తొమ్మిది వేల ఎకరాలకు ఆండ్ర జలాశయం నీరు అందిస్తుంది. ఇప్పటికే నీరు విడుదల చేయాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల జాప్యం జరిగింది. వరినారు ముదిరిపోతున్న నేపథ్యంలో దీని ప్రభావం దిగుబడిపై చూపుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలో కుడి, ఎడమ కాలువల ద్వారా 60 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.