శ్రీకాకుళం నుంచి విశాఖ ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు డ్రైవరు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుం ది. శ్రీకాకుళం ఆర్టీసీ డీఎం, సిబ్బంది తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం వన్ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న చిట్టి కృష్ణ (50) శుక్రవారం ఉదయం ఆరు గంటలకు వైజాగ్ నాన్‌స్టాప్ బస్సు విధులకు హాజరయ్యాడు. ప్రయాణికులతో ఎనిమిది గంటల సమయంలో విశాఖపట్టణ పరిధి మద్దిలపాలెం చేరుకునే సరికి అస్వస్థతకు గురయ్యాడు. దీంతో బస్సును మద్దెలపాలెం డిపోలో ఆపేసి.. వేరే బస్సులో ప్రయాణికులను పంపించేశారు. ఈ క్రమంలో తీవ్ర అవ స్వస్థతకు గురైన కృష్ణ డిపోలోని బల్లపై సొమ్మసిల్లిపడిపోయాడు. దీంతో ఆర్టీసీ సిబ్బంది అతడికి సపర్యలు చేసినా.. ఫలితం లేకపోవడంతో 108లో ఎన్‌ఆర్‌ఐ ఆసు పత్రిలో తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కృష్ణ చనిపోయాడు. మృతదేహాన్ని శ్రీకాకుళం బలగ ప్రాంతంలో గల అతని నివాసానికి తీసుకువచ్చారు.