‘ఎన్‌టీఆర్ వైద్య సేవ’ పథకంలో చేరే రోగులకు మెరు గైన సేవలను అందించాలని ఆస్పత్రులను ఆదేశించినట్టు విశాఖపట్నం జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ కొయ్యాన అప్పారావు చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా నుంచి కొద్దిరోజుల కిందట బదిలీపై వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.... పలు వివరాలను వెల్లడించారు. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే...కార్డుదారులు తన దృష్టికి తీసుకువస్తే ఆయా ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేన్సర్ రోగులకు మెరుగైన వైద్యం అందించడంపై దృష్టిసారించిందన్నారు. కేన్సర్ రోగులకు పథకంలో భాగంగా అందిస్తున్న మొత్తం సరిపోకపోతే మరో రూ.60 వేల వరకూ పెంచుకునే వెసులుబాటు కల్పిం చిందన్నారు. ఈ విషయాన్ని రోగులు గుర్తించి ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందవచ్చునని సూచించారు.