దోమలు విజృంభించకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కాచి చల్లార్చిన నీటినే తాగాలి. జ్వర లక్షణాలుంటే వెంటనే వైద్య సిబ్బంది సహకారంతో డెంగ్యూ, మలేరియా, డయే రియా పరీక్షలు చేయించుకోవాలి అని ప్రజలకు ప్రజా రోగ్య, కుటుంబ సంక్షేమశాఖ రాష్ట్రఅదనపు డైరెక్టర్ డాక్టర్ బి.సుబ్రహ్మణ్యేశ్వరి సూచించారు. వర్షాకాలం దృష్ట్యా ప్రజారోగ్య పరిరక్షణపై అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆమె సూచిం చారు. హనుమాన్‌జంక్షన్ పరిధిలోని బిళ్లనపల్లిలో అనారోగ్య కారణాలతో ఇటీవల వ్యక్తి మృతి చెందడంతో వైద్యాధికారులతో కలిసి శుక్రవారం ఆమె గ్రామంలో పర్యటించారు. మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రిపోర్టులను పరిశీలించారు. తాగునీరు, క్లోరినేషన్, ఫాగిం గ్‌పై సర్పంచ్ వెలివెల రామకృష్ణ, కార్యదర్శి సురేష్‌ను అడిగి తెలుసుకున్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ ఫీవర్‌సర్వే నిర్వహించాలని ఆదేశించారు. బీఎల్‌ఎన్ కుమార్, జిల్లా మలేరియా అధికారి రామారావు, వైద్యాధికారి మంజూష, సబ్ యూనిట్ అధికారి వెంకటరాజు, సీహెచ్‌ఎం ఫణికుమార్ పాల్గొన్నారు.