గ్రామంలో తాగునీటి సమస్య జఠిలంగా ఉన్నప్పటికీ అధికారుల దృష్టికి తీసుకురాకపోవడంతో శుక్రవారం యల్లనూరు మండల ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ సుప్రజారెడ్డికి, కూచివారిపల్లి పంచాయతీ సెక్రెటరీ గంగాదేవికి ఎంపీడీఓ వీర్రాజు మెమోలు జారీచేసినట్లు తెలిసింది. గ్రామంలోని బీసీ, ఎస్సీ కాలనీల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, నీటి కోసం వ్యవసాయ బోరుబావుల వద్దకు వెళుతున్నామని ఆ కాలనీవాసులు రెండురోజులక్రితం మండలకేంద్రానికి వచ్చిన ఎమ్మెల్యే బండారు శ్రావణికి వినతిపత్రం అందించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సమస్యను పరిష్కరించాలని ఎంపీడీఓను ఆదేశించారు. తాగునీటి సమస్యపై తమ దృష్టికి తీసుకురానందుకు గాను రెండురోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఎంపీడీఓ ఆ అధికారులకు మెమోలు పంపించారు.