గత కొంత కాలంగా అదనపు కరువు సాయం విడుదల చేయాలంటూ కోరుతున్న ఏపీ ప్రభుత్వానికి ఊరటనిచ్చే నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు రూ. 900 కోట్ల జాతీయ విపత్తు నిధి కింద ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర సాయం అందించాలని నిర్ణయించింది. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నది. ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొంటున్న ఆరు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అదనపు సాయం ప్రకటించింది. అందులో ఏపీ కూడా ఉంది. అయితే ఈ నిధులను త్వరితగతిన విడుదల చేయించేలా కృషి చేయాలని ఇప్పటికే ఎంపీలకు చంద్రబాబు ఆదేశాలిచ్చిన విషయం విదితమే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa