వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. ఆదివారం మీడియాతో బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. ‘అధికారాన్ని అడ్డం పెట్టుకుని గన్నవరం ఖాన్‌దాదా (వంశీ) ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ కుటుంబ సభ్యులపై అనేక మాటలు అన్నారు. టీడీపీ ఆఫీస్‌ను తగలబెట్టి పారిపోయారు. వంశీ ఎక్కడైనా కనిపిస్తే పోలీసులకు అప్పజెప్పండి.’ అని అన్నారు.