యువతి ప్రాణాల మీదికి తెచ్చిన సెల్ఫీ సరదా.. మహారాష్ట్ర - సతారా జిల్లా బోర్నె ఘాట్‌కు వెళ్లిన స్నేహితులు అక్కడి లోయ వద్ద సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే వారిలో ఓ యువతి ప్రమాదవశాత్తు జారి 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. సమీపంలోనే ఉన్న సేఫ్టీ బృందం ఆమెను రక్షించి క్షేమంగా పైకి తీసుకొచ్చింది.