పేదలు, మధ్యతరగతి, జర్నలిస్ట్‌లకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. మంత్రి కొలుసు పార్థసారధి టిడ్కో,ఈఎంఐ ఇళ్లపై కీలక ప్రకటన చేశారు. ఏడాదిలోపు వాటిని పూర్తి చేసి అర్హులకు అప్పగిస్తామని ప్రకటించారు. ఇవాళ తిరుమల శ్రీవారిని మంత్రి కొలుసు పార్థసారధి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారధి ఈ విషయమై మాట్లాడారు. ఇళ్లులేని ప్రతి పేదవాడికి ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.