మండల అభివృద్ధికి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పొన్నూరు మండల పరిషత్ అధ్యక్షురాలు భవనం పద్మలీల అన్నారు. ఆదివారం పొన్నూరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. మండలంలో ప్రాధాన్యత గల పనులను గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో ఉన్న పలు సమస్యలను సమావేశంలో చర్చించారు. త్రాగునీరు, పారిశుధ్యం పై ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీపీ సూచించారు.