తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో చిరుతిళ్ల కుంభకోణం జరిగిందని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. వైకాపా హయాంలో చిరుతిళ్లకు రూ.3కోట్లు ఖర్చు చేశారని.. దీనిపై ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లే ఫిర్యాదు చేశారన్నారు. నియమించకుండానే 90 మందికి జీతాలిచ్చినట్లు రికార్డులు సృష్టించారు. నగర పాలక సంస్థలో ఎలాంటి వ్యక్తులూ పనిచేయలేదు. రూ.2కోట్ల విలువైన డబుల్ డెక్కర్ బస్సును చెత్తకుప్పల మధ్య పెట్టారు. దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని కిరణ్‌రాయల్ ఆరోపించారు.